ఫాంహౌస్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుల దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉన్న స్టేను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేయొచ్చని కోర్టు తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందన్న న్యాయస్థానం… మరిన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

