హిమాచల్ ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్
రెండు నెలల విద్యుత్ బకాయి చెల్లించకపోతే చాలు…తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే కనెక్షన్ కట్ అంటూ ఆదేశాలిస్తాయి.అలాంటిది హిమాచల్ ప్రభుత్వానికి అక్కడి విద్యుత్ సంస్థలు ఏకంగా రూ.150కోట్ల మేర విద్యుత్ ని సరఫరా రూపంలో అప్పిచ్చాయి. ఒకటి రెండు కాదు ….కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ,కేంద్ర పాలిత ప్రాంతానికి గానీ ఇవ్వని విధంగా రూ.150కోట్ల మేర విద్యుత్ సరఫరా చేశారు.దీంతో ఆయా డిస్కంలపై మోయలేని అప్పుల భారం పడటంతో గత్యంతరం లేక హైకోర్టుని ఆశ్రయించాయి.దీంతో హిమాచల్ కోర్టు…అనూహ్య రీతిలో హిమాచల్ ప్రభుత్వం అవాక్కయ్యేలా తీర్పునిచ్చింది. విద్యుత్ బకాయి చెల్లించే వరకు హిమాచల్ భవన్‌ని విద్యుత్ సంస్థకు ఎటాచ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో అక్కడున్న ప్రభుత్వం ఈ తీర్పుతో విస్తుబోయి… త్వరలోనే విద్యుత్‌బకాయిలు చెల్లిస్తామని తెలిపారు.

