చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) మాజీ ఛైర్మన్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు,మాజీ శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన ఎస్సీ,ఎస్టీ,పోక్సో కేసులు కొట్టివేయాలని కోరుతూ ఆయన గతంలో హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.దీనిపై అప్పట్లో ధర్మాసనం..కొంత కాలం వెసులుబాటు కల్పించి విచారణను వాయిదా వేసి ఉత్తర్వులు ఇచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.శుక్రవారంతో గడువు ముగియడంతో ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ మళ్లీ కోర్టు మెట్లెక్కారు.అయితే దీనికి కోర్టు ససేమిరా అంది.ఇలాంటి కేసుల్లో ఇంత కాలం పాటు వెసులుబాటు కల్పించలేమంటూ తీర్పునిచ్చింది.దీంతో చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది.

