Home Page SliderNews AlertTelangana

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… సిట్‌ మెమోను కొట్టి వేసిన హైకోర్టు

సిట్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కోట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ వెల్లాపల్లి, శ్రీనివాస్‌లను ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ… గతంలో సిట్‌ మెమో దాఖలు చేసింది. అయితే.. ఈ ముగ్గుర్నీ నిందితులుగా చేర్చడాన్ని తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు ఇటీవల సిట్‌ మెమోను కొట్టివేసింది. దీంతో సిట్‌ బృందం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సిట్‌ అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.