సమాధులను కూడా వదలట్లేదు..
హమాస్, హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్ నిరంతరంగా సాగిస్తున్నయుద్ధంలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఎన్నో విచిత్ర ప్రదేశాలలో రహస్య టన్నెల్స్‌ను కనిపెట్టిన ఇజ్రాయెల్ దళాలు, తాజాగా లెబనాన్‌లో ఐడీఎఫ్ దాడులలో సమాధుల కింద హెజ్‌బొల్లా ఏర్పాటు చేసుకున్న సొరంగాన్ని కనిపెట్టారు. కిలోమీటర్ల మేర పొడవైన ఈ టన్నెల్‌లో కమాండ్ కంట్రోల్ రూములు, తుపాకులు, రాకెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనితో ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది ఇజ్రాయెల్. హెజ్‌బొల్లాకు మానవజీవితం అంటే లెక్క లేదని, బతికినా, చనిపోయినా పట్టించుకోదని పేర్కొంది. చనిపోయిన వారి సమాధులపై కూడా గౌరవం లేదని వ్యాఖ్యానించింది. మనిషి చనిపోయినా కూడా సమాధులను కూడా వదలకుండా సొరంగాలకు వాడుకున్నారని విమర్శించింది.

