‘హీరోలు ఎలా చేసినా సూపర్ స్టార్స్ అంటారు’- తమన్నా సంచలన వ్యాఖ్యలు
హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా సూపర్ స్టార్స్ అంటూ అభిమానులు మెచ్చుకుంటారని, కానీ హీరోయిన్స్ చేస్తే మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని తమన్నా వ్యాఖ్యానించారు. ఇటీవల తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్’ అనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన వెబ్‌సిరీస్ పలు విమర్శలకు లోనయ్యింది. దీనిలో తమన్నా చాలా బోల్డ్‌గా నటించిందని, తన ప్రియుడు విజయ్ వర్మతో లిప్ లాక్ సీన్స్ కూడా చేసిందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ తరం ప్రేక్షకులు కూడా ఇంకా సంకుచితంగా ఉన్నారని హీరోయిన్లను ప్రోత్సహించట్లేదని అసహనం వ్యక్తం చేసింది.

ఇక తన హీరో విజయ్ వర్మపై ప్రశంసల జల్లు కురిపించింది. విజయ్ తన జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉందని, తన భావాలను ఎంతో గౌరవిస్తాడని, మహిళలంటే అపరిమితమైన గౌరవం చూపిస్తాడని పేర్కొంది. నేటి యువకులు స్త్రీలతో ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులు నేర్పించాలని, ప్రతీ విషయంలో మహిళలే రాజీ పడాలనే పాతకాలపు ఛాందస భావాలను వదిలిపెట్టాలని సూచించారు. అందుకే విజయ్ వర్మను ప్రేమించానని, తన మనస్సుకు ఎంతో దగ్గరయ్యాడని తెలియజేసింది.

