జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం హేమంత్ సోరెన్ కు ఇది నాలుగోసారి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇండియా కూటమి నేతలు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

