రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కాగా రాబోయే 5 రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే దాదాపు ఓ వారం రోజులపాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వ్యాఖ్యానించింది.దీంతో సముద్రమంతా అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. అయితే ఇప్పటికే అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడిందని వెల్లడించింది.కాగా ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

