ఏపీలో భారీ వర్షాలు..సీఎం కీలక సూచనలు
ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు శాఖల అధికారులతో, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చెరువుల పరిస్థితి గమనించాలి. భారీ వర్షాల కారణంగా వాగులు, కాల్వలు దాటే రోడ్లు మూసివేయాలి. ప్రాజెక్టులలో నీటి నిల్వలను పర్యవేక్షించాలి. విపత్కర పరిస్థితులలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా ప్రమాదాలను అంచనాలు వేయాలి. ప్రజలను వాట్సాప్ గ్రూపుల ద్వారా, మెసేజిల ద్వారా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలి. అని చంద్రబాబు వివరించారు.

