ఏపికి అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఈ నెల 23న ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపిలో అతి భారీవర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.ఈ నెల 26న అది వాయుగుండంగా బలపడి 28న తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు,కేరళ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధానంగా కోస్తా,రాయలసీమ జిల్లాల్లో మంగళ,బుధవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

