Andhra PradeshHome Page Slider

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కి వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను సీజేఐ అక్టోబర్ 3కి వాయిదా వేశారు. అక్టోబర్ 3న మంగళవారం ఏదో ఒక బెంచ్ కేసును విచారిస్తుందని సీజే చెప్పారు. ఐతే అసలు క్వాష్ పిటిషన్‌ను అనుమతించవద్దని సీఐడీ లాయర్లు సీజేను కోరారు. కేసులో లోతైన విచారణ జరగాలని, అప్పుడే నిజాలు నిగ్గు తేలతాయని సీఐడీ లాయర్లు చెప్పారు. సీజేఐ ముందు చంద్రబాబు లాయర్లు, సీఐడీ లాయర్లు కేసు వాదించారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వొచ్చని సీఐడీ లాయర్ రంజిత్ వాదించారు. అన్ని విషయాలు మంగళవారం వింటామని సీజే తెలిపారు. అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఎస్‌విఎన్ భట్టి నాట్ బిఫోర్ బి అంటూ కేసును విచారించడానికి నిరాకరించడంతో మొత్తం వ్యవహారం సీజే ముందుకు వచ్చింది. చంద్రబాబు లాయర్, సిద్ధార్థ్ లూధ్రా అభ్యర్థనతో సీజేఐ కేసును విచారించారు.