Home Page SliderNational

యువతిని హత్య చేసి.. 50 ముక్కలుగా నరికాడు

శ్రద్ధావాకర్ తరహాలో జార్ఖండ్ లో ఓ యువకుడు ప్రియురాలిని హత్య చేసి 50 ముక్కలుగా నరికాడు. ఈ ఘటన కుంతి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోర్దాగ్ గ్రామానికి చెందిన నరేష్ బెంగ్రా అనే యువకుడు, గంగి కుమారి అనే యువతితో రెండేళ్లుగా సహ జీవనంగా కలిసి ఉంటున్నారు. అయితే నరేష్.. గంగి కుమారికి తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా.. ఈనెల 24న యువతిని అడవుల్లోకి తీసుకెళ్లి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత యువతిని 50 ముక్కలుగా నరికి అడవిలోకి విసేరాశాడు. తర్వాత యువతి శరీరంలో ఓ భాగాన్ని కుక్క తినడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా తానే హత్య చేశాడని అంగీకరించాడు.