Home Page SliderInternational

నా బిడ్డకు ఆయనే తండ్రి..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో కలిసి తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ ఆరోపించారు. ఆ బిడ్డ మస్క్ కు 13వ సంతానమని తెలిపారు. ఆమె సోషల్ మీడియా వేదిక పై మనసులోని మాట బయట పెట్టింది. ‘మా చిన్నారి గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు నేను ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయి. అందుకే నేనే చెబుతున్న. మా సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్న. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్న” అని తన పోస్టులో కోరారు. అయితే దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.