Home Page SliderNational

కాశ్మీర్ సీఎం అతనే..తేల్చి చెప్పిన ఎన్‌సీ అధ్యక్షుడు

జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ కూటమి ఘనవిజయం సాధించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా రెండుచోట్ల పోటీ చేసి, విజయం దిశగా దూసుకెళుతున్నారు. బుద్గాం, గందర్ బల్ రెండు నియోజక వర్గాలలోనూ ఆయన పోటీ చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ తదుపరి సీఎంను ప్రకటించారు. పార్టీలో గొప్ప నేతగా ఎదిగిన ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలు  గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు ఏకైక కుమారుడు కావడం విశేషం. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా కూడా గతంలో కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీనితో మూడు తరాలుగా వీరి కుటుంబం ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఘనత సాధించింది.