“ఆదిపురుష్” కొత్త పోస్టర్ చూశారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,కృతి సనన్ జంటగా ఔం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్,పోస్టర్,పాటలకు భారీగా స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా..క్షణాల్లోనే టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. అయితే ఈ చిత్రయూనిట్ తాజాగా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా ఈ పోస్టర్‌లో హీరో ప్రభాస్ రావణాసురుడితో జరిగే యుద్ధంలో గంభీరమైన లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మరి పోస్టర్‌కే ఇంతటి క్రేజ్ లభిస్తే..సినిమా రిలీజ్ అయ్యాక ఇది ఇప్పటివరకు ఉన్న సినిమా రికార్డులను తిప్పికొడుతుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

