Home Page SliderNational

కర్ణాటకలో ద్వేషం చెరిగిపోయింది..ప్రేమ గెలిచింది: రాహుల్ గాంధీ

ఈ రోజు కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వెంట న్యాయం ,పేదలు ఉన్నారన్నారు. కానీ బీజేపీ వెంట ధన బలం,ద్వేషం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మీరు ఇన్నాళ్లు కర్ణాటకలో అవినీతి పాలనను చూశారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అవినీతి రహిత ప్రభుత్వ పాలనను అందిస్తామన్నారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని..కాంగ్రస్ పార్టీ ఎప్పుడు తప్పుడు హామీలను ఇవ్వదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ద్వేషం చేరిగిపోయి..ప్రేమ గెలిచిందన్నారు. కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎంగా సిద్దరామయ్య,డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్,మంత్రులుగా జి.పరమేశ్వరన్,మునియప్ప,జార్జ్,ఎంబీ పాటిల్,సతీష్ జర్కీహోళీ,ప్రియాంక్ ఖర్గే,రామలింగారెడ్డి,అహ్మద్ ఖాన్ తదితరులు ప్రమాణం చేశారు. దీంతో కర్ణాటకలో సిద్దరామయ్య సీఎంగా కొలువుదీరారు.