అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న ‘హరోంహర’
నవదళపతి సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోంహర’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటిటి స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఈ చిత్రాన్ని నేషన్ వైడ్‌గా ట్రెండింగ్‌లో కొనసాగిస్తున్నారు.
ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా సునీల్, జయప్రకాశ్ అక్షర, అర్జున్ గౌడ, రవి కాలె తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రొడ్యూస్ చేశారు.

