హరీష్ రావు పాదయాత్ర
మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్‌రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతూ ఆయన ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలో సంగమేశ్వర ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు పర్యటించనున్నారు.దాదాపు 130 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతులతో మాట్లాడనున్నారు.గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించి అన్నదాతల అభిప్రాయాలు ఆలకించనున్నారు.చివరి రోజు సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరౌతారని తెలిపారు.

