Andhra PradeshHome Page Slider

“డిప్యూటీ సీఎంని కలవడం సంతోషంగా ఉంది”:అల్లు అరవింద్

టాలీవుడ్ నిర్మాతలు ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ నిర్వహించారు. కాగా విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.కాగా ఈ సమావేశానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,డివీవీ దానయ్య,దిల్ రాజు,అశ్వనీ దత్‌,దగ్గుబాటి సురేష్‌తో పాటు పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఈ భేటీ  ముగిసిన తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్  మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ముందుగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.ఈ విధంగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అరవింద్ పేర్కొన్నారు. అనంతరం సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఏపీలో సినీరంగ అభివృద్ది,విస్తరణపై చర్చించామన్నారు. అయితే మరోసారి పవన్‌ను కలిసి రిప్రెంజంటేషన్ ఇస్తామని అల్లు అరవింద్ తెలిపారు.కాగా సినిమా టికెట్లపై చర్చించడానికి అది పెద్ద విషయం కాదన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సన్మానిస్తామని అల్లు అరవింద్ వెల్లడించారు.