అంబర్ పేటలో వడగళ్లవాన-నిలిచిన శోభాయాత్ర
హైదరాబాద్‌లో మధ్యాహ్నం అయ్యేసరికి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ రోజు జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రకు వర్షం ఆటంకంగా నిలిచింది. అంబర్ పేటలో వడగళ్లవాన పడుతుండడంతో శోభాయాత్ర కాసేపు ఆగిపోయింది. రోజూ సాయంత్రం పూట ఈదురుగాలితో హఠాత్తుగా భారీ వర్షం కురుస్తున్నాయి. హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, కోటి, మల్కాజ్‌గిరి, నాచారం, మలక్‌పేట్,దిల్‌సుఖ్‌నగర్, తార్నాక,అంబర్‌పేటలో వర్షం బాగా పడుతోంది. పెద్దశబ్ధంతో గాలులు వీస్తున్నాయి. అంబర్ పేటలో వడగళ్లవాన బీభత్సం సృష్టించింది. వాననీరు, డ్రైనేజ్ వాటర్‌తో కలిసి, రోడ్లపై కాలువలుగా పారుతోంది.

