గ్రీన్ ఫిల్డ్ కోస్టల్ హైవేకు గ్రీన్ సిగ్నల్
అమరావతి .. ఉత్తరాంధ్రలో కీలకమైన మరో గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు లైన్ క్లియర్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే నిర్మాణం రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ హైవే గురించి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మూడు జిల్లాలకు మహర్ధశ పట్టింది. ఈ హైవే మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఉంటుందని చెబుతున్నారు. పర్యావరణానికి అనుకూలంగా, వేగంగా వెళ్లేందుకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ హైవే పై మరింత ఫోకస్ పెట్టారు. ఈ కోస్టల్ నేషనల్ హైవే ఆవశ్యకతను కేంద్రానికి తనదైన శైలిలో వివరించారు. సుమారు 200 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ నేషనల్ హైవేకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. ఈ హైవేకు సంబంధించి ఆదేశాలు ఇంకా రాలేదని.. ఒకవేళ వస్తే కనుక డీపీఆర్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అటవీ, తీరప్రాంత, రాయితీ, స్థలాలు ఎంత అవసరమో గుర్తిస్తామని అధికారులు తెలిపారు.

