ఒకే కుటుంబంలో ఐదుగురికి గవర్నమెంట్ జాబ్స్
TG: ఈ కాలంలో ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఏకంగా కుటుంబంలోని అందరికీ జాబ్స్ రావడం గొప్ప విషయంగా భావిస్తున్నారు. అలాంటిది సంగారెడ్డి(D)లోని ఓ కుటుంబంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రాయికోడ్‌కు చెందిన రాఘవరెడ్డి, శోభమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ముగ్గురు టీచర్ పోస్టు ఉద్యోగాలు పొందారు, ఇద్దరు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు సాధించారు. కాగా వీరి తండ్రి రిటైర్ట్ పోస్ట్ మాస్టర్ – సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కావడం విశేషం.