Home Page SliderTelangana

నిరుద్యోగులకు శుభవార్త.. ఉస్మానియా మెగా జాబ్ మేళా..

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ , యువకులకు శుభవార్త. వారికి ప్రయివేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 23 వతేదీన ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్‌ఫర్మేషన్, గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి టి. రాము తెలిపారు. ఐ.టి.ఐ డీజిల్ మెకానిక్ , డిప్లొమా మెకానికల్ , డిగ్రీ , పీజీ , బీటెక్ చేసినవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు.హైదరాబాద్ మిత్ర ఏజెన్సీస్ సహకారంతో నిర్వహించే ఈ జాబ్ మేళా సెప్టెంబర్ 23 న ఉదయం పదకొండు గంటల వరకల్లా హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్: 7799884909.