10 తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్
పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్దే మధ్యాహ్న భోజనం అందించాలని పాశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంగా ఉండి, పరీక్షలు రాసేవారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులయితే ఈ సదుపాయం వర్తిస్తుంది. కొన్ని చోట్ల ఇతర గ్రామాల నుండి విద్యార్థులు వస్తారు కాబట్టి వారికి ఇంటికి వెళ్లి తినాలంటే చాలా ఆలస్యమవుతుందని ఈ సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

