అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త..
అతికష్టమైన అమర్‌నాథ్ ప్రయాణాన్ని సుఖవంతం చేయడానికి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం సంకల్పించింది. యాత్రికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అమర్‌నాథ్ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్‌వేల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటి రూపకల్పన కోసం బిడ్‌లను ఆహ్వానించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బాల్‌టాల్ నుండి 3,880 మీటర్ల ఎత్తులోని అమర్‌నాథ్ గుహ వరకూ 11.60 కిలోమీటర్ల మేర ఒక రోప్‌వేతో పాటు బడ్‌గాం, రామ్‌బన్ జిల్లాలలో నిర్మించాల్సిన రెండు రోప్‌వేలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే శంకరాచార్య ఆలయం వల్ల రోప్‌వే నిర్మాణ ప్రక్రియ డీపీఆర్ దశలో ఉందని పేర్కొంది.

