బంగారు శివలింగం రికార్డు..
కేవలం 100 మిల్లి గ్రాముల బంగారంతో ఏదైనా చెయ్యడం సాధ్యమేనా?… సాధ్యమేనని నిరూపించాడు కాకినాడ జిల్లా తుని పట్నానికి చెందిన స్వర్ణకారుడు కోటేశ్వరరావు. అతి చిన్న బుల్లి బంగారు శివలింగం చేసి రికార్డు సృష్టించాడు. ఈ లింగం రూపొందించడానికి కేవలం 100 మిల్లీ గ్రాముల బంగారాన్ని వాడినట్లు తెలిపారు. దీని రూపకల్పనకు 3 గంటల సమయం పట్టిందని, కార్తీక మాసంలో దీనిని తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అతి చిన్న సైజులో ఉన్న శివలింగం, దానిపై నాగసర్పం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

