పసిడి ధరలు పైపైకి.. ఆల్ టైమ్ రికార్డ్..
రోజు రోజుకి పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ప్రియులు పెరిగిన ధరలతో అయోమయంలో పడ్డారు. ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.83,020 ఉండగా ఇవాళ 84,330కి చేరింది. అంటే రూ.1,310 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.76,100 ఉండగా ఇవాళ రూ.77,300 పెరిగింది. అంటే రూ.1,200 పైకి ఎగబాకింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లలో మార్పు చేయకపోవడం, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.87కు చేరడం వంటి కారణాలతో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా ఇవాళ భారీగానే పెరిగాయి. నిన్న కేజీ వెండి ధర రూ.1,06,000 ఉండగా రూ.వెయ్యి పెరిగి రూ.1,07,000కు చేరింది.

