BusinessHome Page SliderInternationalNews Alert

బంగారం, వెండి దేవుని సొమ్ము..బిట్ కాయిన్ ప్రజల డబ్బు

ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ గురు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆధునిక కరెన్సీ విలువలు కోల్పోవడానికి ప్రధాన కారణాలు వెల్లడిస్తూ బంగారం, వెండి దేవుని సొమ్ము అని, బిట్ కాయిన్, ఈథీరియంలను ప్రజల సొమ్ము అని అభివర్ణించారు. ద్రవ్యోల్బణ సమయంలో కూడా పెట్టుబడులు పెడుతున్న వారే లాభపడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం రక్షిస్తుంది అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని చెప్పారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో డాలర్ ను బంగారం ప్రమాణం నుండి తొలగించడం వంటి కారణాలతో ప్రపంచాన్ని రుణ ఆర్థిక వ్యవస్థగా మార్చేసాయని దీని వల్లే అమెరికా, జపాన్ వంటి దేశాలు కూడా భారీ రుణ భారంతో సతమతమవుతున్నాయని పేర్కొన్నారు. తన అనుభవాలు చెప్తూ..1970లలో బంగారు నాణెం విలువ భారీగా పెరిగిందని, తాను ఇప్పటికీ బంగారం, వెండి నిల్వచేస్తానని చెప్పారు. స్కూల్ స్థాయి నుండి విద్యార్థులకు ఆర్థిక విద్యను నేర్పించాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవుతారని పిలుపునిచ్చారు.