14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకున్న గాలి
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 14 ఏళ్ల తర్వాత బళ్లారి రానున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన గురువారం బళ్లారిలో కాలుమోపనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తాను ఎంతో ఆనందపడ్డానన్నాడు. రాజకీయంగా తనకు పునర్జన్మ ప్రసాదించిన గంగావతిని ముందుగా పర్యటిస్తానన్న జనార్దన్ రెడ్డి చెప్పాడు. 2008లో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో గాలి జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. గనుల తవ్వకాల్లో అక్రమాలతో ఆయనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయంతీసుకోవడంతో ఇన్నాళ్లూ ఆయన బళ్లారికి దూరంగా ఉన్నారు. తాను బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్న గాలి, వచ్చే రోజుల్లో పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నాడు. ఉపఎన్నికల్లో సండూర్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానన్నాడు.


