ఆంధ్రా రాజపక్స చంద్రబాబే..!
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిపై రాష్ట్ర,కేంద్ర ప్రతిపక్ష నాయకులు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు.అయితే వీరి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని,అయితే ఇప్పుడు దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఈ మధ్యకాలంలో శ్రీలంక ఆర్ధిక సంక్షోభంపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ఆర్ధిక పరిస్థితి గురించి కనీసం ప్రస్తావించకుండా కేవలం రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులను మాత్రమే ప్రస్తావించారన్నారు. అదే విధంగా కేంద్రం, చంద్రబాబు ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆత్మ పరీశీలన చేసుకోవాలని సూచించారు. కేంద్రం కంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి కేంద్రంతో,ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బాగుందన్నారని చెప్పారు విజయసాయిరెడ్డి. అసలు చంద్రబాబు శ్రీలంక ఆర్ధిక పరిస్థితిని ఏపీతో పోల్చడం సరికాదన్నారు. ఎగుమతుల విషయంలో శ్రీలంక కంటే ఏపీ ముందంజలో ఉందన్నారు. అయితే 2021లో డెబిట్ జీఎస్డీపీ రేషియోలో కేంద్రం 57%, పంజాబ్ 47%, రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్ 38.8%, కేరళ38.3%గా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం 32.4% గా ఉందని తెలిపారు. దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎంత అన్యాయం చేస్తుందో గమనించవచ్చన్నారు. కేంద్రం రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెస్, సర్ ఛార్జీలను పంచుకుంటూ పోతుందని తెలిపారు. గత గణాంకాలను చూసుకుంటే చంద్రబాబు ఏ విధంగా ఏపీని అప్పుల్లో ముంచేత్తారో అర్ధమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 2 ఏళ్లు కరోనా కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు దారుణంగా పతనావస్థకు చేరాయన్నారు.
ఇటువంటి పరిస్థితులలో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వారిని ఆదుకున్నారని తెలిపారు. చంద్రబాబు హాయాంలో అవసరం లేకున్నా అప్పులు చేసి నిధులు దుర్వినియోగం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో లక్షా 62 వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం కేంద్రం సమాధానమిచ్చారు. జగన్ ప్రభుత్వం ఆర్ధికంగా, సామాజికంగా పేదలను ఆదుకునేందుకు కృషి చేస్తుంటే, మరో పక్క ఏపీ, టీడీపీ నేతలు మాత్రం ఉచిత పథకాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అదే విధంగా రాష్ట్ర జీఎస్డీపీ 10,14,374 కోట్లు ఉంటే … 2021-22లో అది 12,01,736 కోట్లకు పెరిగిందన్నారు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు 14.50%,హార్టీ కల్చర్ 13.24%,లైవ్ స్టాక్ సెక్టార్ 11.46% వృద్దిని సాధించాయన్నారు.
అతి త్వరలోనే చంద్రబాబు కూడా మరో రాజపక్సలా కానున్నారని… త్వరలోనే ఆయన దేశం విడిచిపారిపోయే అవకాశం కూడా ఉందని తెలిపారు. అయితే చంద్రబాబు తన ప్రభుత్వ హాయాంలో కేవలం ఐదుగురు వ్యక్తుల ప్రయోజనాల కోసమే అనుక్షణం కష్టపడ్డారని.. ఏపీ ప్రజలకు ఎటువంటి ఉపకారం చేయలేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.