ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక మలుపు
ఫార్ములా-ఈ రేస్‌లో ఏసీబీ దర్యాప్తు జోరుగా కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించారు. రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు కూడా ఈ నెల 18న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. నిజానికి 2022 అక్టోబర్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం సీజన్ 9,10,11,12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను సంస్థ భరించాలి. ఈ సంస్థ 2023లో రూ.90 కోట్లు చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదు. సీజన్-9లో తమకు నష్టం కలిగిందంటూ వెల్లడించింది. దీనితో ఈ సొమ్మును హెచ్‌ఎండీఏనే పోషించాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీనితో అప్పుడు రూ.45.71 కోట్లు ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ బదిలీ చేసింది. ఈ సొమ్ము బదిలీ ఈ వివాదానికి కారణమయ్యింది. ఈ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏసీబీ విచారణ చేస్తోంది.

