మాజీ వైసీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్..
ఏపీలోని మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. దీనితో తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రికి వెళ్లాలని కేతిరెడ్డి సిద్ధమవగా, ఆయనకు అనుమతిని నిరాకరించారు. తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్భంధంలో ఉంచిన పోలీసులు ఆయనకు 41 నోటీసులు జారీ చేసి, ఇంట్లో నుండి బయటకు వెళ్లొద్దంటూ గృహనిర్భంధం చేశారు. ఎమ్మెల్యే జేసీ వర్గీయులే దీనికి కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. తన నియోజకవర్గమైన తాడిపత్రిలో తిరగడానికి తనకు అనుమతులు ఎందుకని ఆయన మండిపడుతున్నారు.

