మదన్ లాల్ ఇకలేరు..
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ (62) కన్నుమూశారు. గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఈర్ల పుడి గ్రామంలో జన్మించిన మదన్ లాల్.. ఉస్మా నియా యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి మదన్ లాల్ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ప్రముఖుల సంతాపం మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

