రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి
చెన్నపట్నం నుంచి వరుసగా రెండోసారి పోటీ
50 ఎమ్మెల్యేలను గెలుచుకోవడమే టార్గెట్‌గా రాజకీయాలు
జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఈసారి చెన్నపట్నం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న తరుణంలో, జేడీఎస్ మాత్రం బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించింది. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తన పార్టీకి మద్దతునిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పంచరత్న రథయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది నవంబర్ 1న ప్రారంభమైన యాత్ర మార్చి 26న మైసూరులో ముగిసింది.

హెచ్‌డీ కుమారస్వామికి సంబంధించిన ఐదంశాలు
1) 1996 సాధారణ ఎన్నికల్లో కనకపుర స్థానం నుంచి హెచ్‌డీ కుమారస్వామి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నిక. తండ్రి హెచ్‌డీ దేవెగౌడ కూడా ఈ నియోజకవర్గాని గతంలో ప్రాతినిధ్యం
2) 1999 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో, కుమారస్వామి సాథనూర్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి DK శివకుమార్ చేతిలో ఓటమి రామనగర నియోజకవర్గం నుంచి 2004లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక
3) కర్నాటక సీఎంగా రెండుసార్లు పనిచేసిన కుమారస్వామి. ఫిబ్రవరి 2006- అక్టోబర్ 2007 మధ్య, 2018 మే నుండి 2019 జూలై వరకు బాధ్యతలు
4) 2019 జూలైలో సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
5) 2028 ఎన్నికలు తన చివరి అసెంబ్లీ ఎన్నికలని ప్రకటించిన కుమారస్వామి. ఐనా, తాను రాజకీయాల్లో చురుకుగా ఉంటానని వెల్లడి. 2018 ఎన్నికల్లో రామనగర, చెన్నపట్నం రెండు స్థానాల్లో గెలుపు

