ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు ఛాతీ నొప్పి
ఆస్ట్రేలియా క్రికెట్‌లో రికీ పాంటింగ్‌ది ప్రత్యేక ప్రస్థానం. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా పాంటింగ్ ఘనత అందుకున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాంటింగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో భాగంగా పాంటింగ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టెస్ట్ మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మ్యాచ్ కామెంటరీ చేస్తున్న పాంటింగ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన పాంటింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాంటింగ్‌కు డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఇప్పటికైతే పాంటింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

