అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు జైలు శిక్ష
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలు వాస్తవమని సీబీఐ కోర్టులో రుజువైంది. దీంతో సీబీఐ ఆమెకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా ఆమె భర్త రామకోటేశ్వరరావుకి సీబీఐ కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండి గీత దంపతులకు సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బందికి కూడా సీబీఐ కోర్టు జైలుశిక్ష,రూ.లక్ష జరిమానా విధించింది.

హైదరాబాద్‌లో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అదుపులోకి తీసుకుంది. గీతను అరెస్ట్ చేసిన సీబీఐ విచారణ నిమిత్తం ఆమెను బెంగుళూరుకు తరలించింది. ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.42.79కోట్లు రుణం తీసుకున్నారు. విఘ్నేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో గీత దంపతులు ఈ లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రుణాన్ని ఆమె తిరిగి చెల్లించకుండా ఉన్నారని పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులు గతంలో ఆమెను తన భర్తతో సహా విచారించారు. కొత్తపల్లి గీత 2014 ఎలక్షన్స్‌లో వైసీపీ అభ్యర్థిగా పోటి చేసి ఎంపీగా గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

