రంగంలోకి ఏపీ సిఐడి చంద్రబాబు నాయుడు పై ఫోకస్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు వ్యవహారంపై ఏపీ సిఐడి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో విచారణ కొనసాగిస్తున్న సిఐడి తాజాగా ఐటి నోటిఫికేషన్ వ్యవహారంలోనూ మూలాలు వెదుకుతోంది. ఈ రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కామన్ గా ఉండటం, మూలాలు ఒకేలా ఉన్నట్లుగా భావిస్తున్న సిఐడి ఇప్పటికే రంగంలోకి దిగింది. దీంతో విచారణను ప్రారంభించింది. రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఐటీ వ్యవహారంలో కీలక పాత్ర వహించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సూత్రధారిగా భావిస్తున్న యోగేష్ గుప్తాకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరిని త్వరలో విచారించేందుకు సిద్ధమవుతుంది. చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ ఆగస్టు 4వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో రాజకీయంగా విమర్శలకు తావిచ్చింది. ఇంత జరుగుతున్నా, మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు చంద్రబాబు స్పందించలేదు.

