Home Page SliderInternational

క్రెమ్లిన్‌లో ఫ్లూ… బంకర్‌లోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌

రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌లో ఇప్పుడు అధికారులంతా ఫ్లూ వ్యాప్తితో సతమతమవుతున్నారు. ఫ్లూ కారణంగా.. హైపోకాన్డ్రియాక్ ధోరణులను పుతిన్ సతమతమైనట్టుగా తెలుస్తోంది. క్రెమ్లిన్‌లోని చాలా మంది అధ్యక్ష అధికారులు ఫ్లూతో బాధపడుతున్నారని వార్తా సంస్థ నోవాయా గెజిటా యూరోప్ నివేదించింది. ఒక దశాబ్దంలో మొదటిసారిగా పుతిన్ తన వార్షిక సంవత్సరాంతపు విలేకరుల సమావేశాన్ని రద్దు చేసిన రెండు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రష్యా అధ్యక్షుడు వార్షిక వార్తా సమావేశాన్ని నిర్వహించరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సోమవారం తెలిపారు. అయితే ఈ తరలింపు వెనుక కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఓవైపు ఫ్లూ.. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా ఎదురుదెబ్బలు ఇందుకు కారణమని పాశ్చాత్య మీడియా ప్రచారం చేస్తోంది. 10 సంవత్సరాలలో పుతిన్ వార్షిక ఈవెంట్‌ను నిర్వహించకపోవడం ఇదే మొదటిసారి అని UK రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐతే ఇంటర్వ్యూలో ప్రశ్నలు రష్యాలో యుద్ధ వ్యతిరేక భావన ప్రాబల్యంపై ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నెల ప్రారంభంలో ఉక్రెయిన్ బాంబులు ప్రయోగించినప్పుడు రెండు రష్యన్ సైనిక ఎయిర్‌ఫీల్డ్‌లను తాకడం కూడా చర్చనీయాంశమయ్యింది. ఫిబ్రవరి 24, 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే ఉక్రెయిన్ అతి పెద్ద ప్రతీకారదాడి. రష్యాలోని మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌లపై దాడి తర్వాత పుతిన్… ఉరల్ పర్వతాలకు తూర్పున ఉన్న బంకర్‌లో గడిపుతారని ప్రచారం జరిగింది.