Home Page SliderTelangana

తెలంగాణాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వరదలు

తెలంగాణాలో గతకొన్ని రోజలు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాగులు,వంకలు,నదులు ఉప్పొంగి వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం జిల్లాల్లో ఈ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఈ జిల్లాల్లో ఇప్పటివరకు 17మంది మృతి చెందినట్లు సమాచారం. అయితే మరో 9 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ములుగు జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి 8మంది, హనుమకొండ జిల్లాలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లి జిల్లాలో ఒకరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు తనువు చాలించారు.అయితే ఈ వరదల కారణంగా విద్యుత్ శాఖకు రూ.7 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.