Andhra PradeshHome Page Slider

పులివెందులలో నడిరోడ్డుపైనే కాల్పులు -ఒకరి మృతి

కడప జిల్లా పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నడిరోడ్డు పైనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో దిలీప్, మస్తాన్ బాషా అనే వ్యక్తులపై కాల్పులు జరిపాడు భరత్ కుమార్. దిలీప్ అనే వ్యక్తి ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు. దిలీప్‌కు, భరత్‌కుమార్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగిందని, గట్టిగా అరుచుకున్నారని, ఈ క్రమంలో భరత్ కుమార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో దిలీప్ పక్కనే ఉన్న మస్తాన్ బాషా అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. భరత్ కుమార్ గత వారం రోజులుగా అప్పుల విషయంలో దిలీప్‌తో గొడవ పడుతున్నాడని సమాచారం. గాయపడిన బాషా మాట్లాడుతూ..వీరిద్దరి మధ్యగల లావాదేవీల సంగతి తెలియదని దిలీప్ రమ్మంటే వెళ్లానని తెలియజేశాడు. భరత్ కుమార్‌పై చాలా కేసుల్లో ఆరోపణలు ఉన్నాయని, గతంలో వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్‌కు ఈ భరత్ కుమార్ యాదవ్ బంధువని తెలిసింది. ఆర్థిక వ్యవహారాలలో సెటిల్‌మెంట్లు చేస్తుంటాడని, తుపాకీతో పలువురిని బెదిరించాడనీ పోలీసులు పేర్పొన్నారు.  ప్రస్తుతం భరత్ కుమార్ పరారీలో ఉన్నాడని సమాచారం.