ఎలక్ట్రికల్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. 8 మంది పర్యాటకులు మృతి
సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం
అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం
దట్టమైన పొగ వ్యాప్తితో ఘోరం
ఊపిరాడక ఎనిమిది మంది దుర్మరణం
సికింద్రాబాద్ లో ఘోరం జరిగింది. ఎలక్ట్రికల్ వాహనాల షోరూమ్‌లో వ్యాపించిన మంటలు కల్లోలం రేపాయ్. దట్టమైన పొగ వ్యాపించడంతో ఎనిమిది మంది అమాయకులు బలయ్యారు. చనిపోయిన వారంతా 40 ఏళ్లలోపు వయుసు వారే. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలతో… పై ఫ్లోర్ లో ఉన్న ప్రలు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పర్యటించేందుకు వచ్చిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మోండా మార్కెట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.

పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో ఉన్న రూబీ లగ్డరీ ప్రైడ్ భవనంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లో రూబీ ఎలక్ట్రికల్ వాహనాల షోరూమ్ ఉంది. రాత్రి 9 గంటల 40 నిమిషాల్లో అకస్మాత్తుగా మండలు రావడంతో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో లాడ్జిలో 25 మంది టూరిస్టులు ఉన్నారు. క్షతగాత్రులకు గాంధీ ఆస్పత్రులో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన తెలుసుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసానీ శ్రీనివాస్, ఎమ్మెల్యే సాయన్న సాహయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.


