Home Page SliderTelangana

చేపల కోసం ఎగబడ్డారు..

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తాతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో లైవ్ ఫిష్ కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో అక్కడి జనం పోటీ పడి అరగంటలోపే మొత్తం చేపల్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేశారు. ఈ ఘటన తో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లారీ బోల్తా పడడంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.