Andhra PradeshHome Page Slider

ఘోర రోడ్డు ప్రమాదం -ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి వంతెనపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ దుర్గటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరు మిద్దె సత్యనారాయణ, రవితేజ, అరుణ, దాసరి శ్రావణి, లక్ష్మి, లోహిత్ గగన్‌(8) గా గుర్తించారు. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన 8 మంది హైదరాబాద్‌లో వివాహానికి హాజరై తిరిగి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు వస్తున్న కారు అదుపు తప్పి అనంతపల్లి శివార్లలో బలంగా ఆగిన లారీని ఢీకొట్టింది. దీనితో అప్పటికప్పుడే ఆరుగురు మరణించారు. మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని కొవ్వూరు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గ అనే మహిళ కూడా మృతి చెందారు. సాయి అనే వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.