కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తుముకూరు జిల్లా శిరా తాలుకా బాలినహళ్లిలో లారీ,జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయ్యి.. పూర్తిగా ధ్వంసమయ్యింది.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాలస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన బాధితులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో జీపులో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

