NewsTelangana

పోలీసులకు లొంగిపోయిన ఫాంహౌస్‌ నిందితులు

మొయినాబాద్ ఫామ్ హౌస్ నిందితులు నందకుమార్‌, సింహయాజులు, రామచంద్రభారతిలు పోలీసులకు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్‌ SOT పోలీసులు మీడియాకు కంట పడకుండా షేక్‌పేట్‌ నుంచి వారిని తరలించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. మునుగోడు ఎన్నికల వరకు విచారణ జరపవద్దని హైకోర్టు ఆదేశించడంతో.. వారిని జైలుకు తరలించనున్నారు. ఇంతకు ముందు ఫౌంహౌస్ నిందితుల రిమాండ్‌కు హైకోర్టు అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్‌ కమిషనర్‌ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.