Andhra PradeshcrimeHome Page Slider

న‌ర‌స‌రావుపేట‌లో న‌కిలీ ఏసిబి

ప‌ల్నాడు జిల్లా కేంద్ర‌మైన న‌ర‌స‌రావుపేట‌లో సైబ‌ర్ నేర‌గాళ్లు హ‌ల్చ‌ల్ చేశారు.న‌కిలీ ఏసిబి అధికారుల‌మంటూ కొన్ని గంట‌ల పాటు గంద‌ర‌గోళం సృష్టించారు.త‌హ‌శీల్దారు కార్యాల‌యంలోకి చొర‌బ‌డి… డీటీ 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు.రెవిన్యూ ఇన్స్పెక్ట‌ర్‌ ను బెదిరించి గూగుల్ పే ద్వారా రూ.70,000 బ‌ల‌వంతంగా వాళ్ల బ్యాంకు ఖాతాకు త‌ర‌లించుకున్నారు .తీరా తేరుకుని ఆలోచించాక వారు సైబ‌ర్ నేర‌గాళ్ల‌ని తెలుసుకుని కంగుతిన్నారు.అనంత‌రం సైబర్ నేర నియంత్రణ కార్యాల‌యానికి ఫిర్యాదు చేశారు.