ఎస్.ఎల్.బి.సి మృతుల వెలికితీత
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం మార్గంలో జరిగిన ఘటనలో మృతులను వెలికితీసే ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తున్నారు.సహాయక చర్యలు ముమ్మరం చేసి ఇప్పటికే మూడు మృతదేహాలను వెలికితీశారు.మరో 5 మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.మృతుదేహాలను డి.ఎన్.ఏ.పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షలు చేస్తున్నారు.ఈ రోజు రాత్రి వరకు సాధ్యమైనమేర అన్నీ మృతదేహాలను వెలికితీస్తామని అధికారులు ప్రకటించారు.అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేయకుండా సహకరించాలని మంత్రులు కోరుతున్నారు.

