ఛార్టర్డ్ ఫ్లైట్‌లో మాజీ మంత్రి కుమారుడి రహస్య ట్రిప్..బెడిసికొట్టిన ప్లాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నేత తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ వెళ్తామని ప్లాన్ చేశారు. దీనికోసం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఛార్టెర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. జాలీగా బయల్దేరి అండమాన్ వరకూ కూడా వెళ్లిపోయారు. కానీ అతని తండ్రి తానాజీ చేసిన పని వల్ల వారి ప్లాన్ బెడిసికొట్టింది. తన కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు డీజీసీఏ సహాయంతో ఆ విమానాన్ని వెనక్కి రప్పించారు. బ్యాంకాక్ వెళ్తుందనుకున్న విమానం పుణెలో దిగడంతో రిషిరాజ్, అతని స్నేహితులు షాక్ అయ్యారు. పోలీసుల విచారణలో బిజినెస్ మీటింగ్ అని చెప్పినా..తర్వాత వారి రహస్య ట్రిప్‌ను బయటపెట్టారు.

