Andhra PradeshHome Page Slider

ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలివిగో… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

వైసీపీలో ఇకపై ఉండదల్చుకోలేదన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ గురించి మాత్రమే మాట్లాడతానన్నారు. ఆధారాల్లేకుండా మాట్లాడేవ్యక్తిని కానన్నారు. అనవసర రాద్ధాంతం చేయడం ఇష్టం లేదన్నారు. సజ్జల, విజయసాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు కోటంరెడ్డి. అన్నా జగనన్నా… నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుందంటూ విరుచుకుపడ్డారు 9849966000 నెంబర్ సీతారామంజనేయులుది కాదా అని ప్రశ్నించారు కోటంరెడ్డి. ఈ నెంబర్‌ను సీతారామాంజనేయులు ఎప్పట్నుంచో వాడుతున్నారన్నారు. పొరపాటు చేసి… ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా అంటూ దుయ్యబట్టారు. టీడీపీలోకి వెళ్తానని ముందుగానే కలలు కని ట్యాపింగ్ చేశారా అంటూ మండిపడ్డారు. సంభాషణలను దొంగచాటుగా విన్నారన్నారు. ట్యాపింగ్ కాదంటే నిరూపించాలన్నారు. కొద్ది రోజుల క్రితం నా బాల్య మిత్రుడితో ఐ ఫోన్‌లో మాట్లాడగా… నా స్నేహితుడితో మాట్లాడిన విషయాల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ అడిగారన్నారు. ఐబీ చీఫ్ సీతారామమంజనేయులు తనకు ఆడియో సైతం పంపారన్నారు. మూడు నెలలుగా ట్యాపింగ్ జరుగుతోందని… 20 రోజుల ముందు ఆధారాలు లభించాయన్నారు కొటంరెడ్డి.