జోరువానలోనూ..హోరేత్తిన విశాఖ గర్జన
ఏపీలో రాజధాని వికేంద్రికరణకు మద్దతుగా జరిగిన విశాఖ గర్జనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. నాన్ పొలిటికల్ జేఏసీ ఈ విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది. జేఏసీ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ఈ విశాఖ గర్జనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. దీంతో జేఏసీ వైసీపీ మంత్రులు,నాయకులను ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానించింది. కాగా వైసీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు,జేఏసీ నేతలు,మేధావులు,విద్యావేత్తలు,ప్రొఫెసర్లు జోరువాను లెక్క చేయకుండా ఈ ర్యాలీ పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతూ రాష్ట్ర నలుమూలల నుంచి జోరువానలోనూ… ప్రవాహంలా ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ విశాఖ గర్జన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమై విశాఖ బీచ్ రోడ్డులోని వైస్సార్ విగ్రహం వరకు సాగింది. దీంతో ఈ రోజు విశాఖపట్నం జనసంద్రంతో నిండిపోయింది.

